ప్రత్యేక అలంకరణలో పార్వతి సంగమేశ్వర స్వామి దివ్య దర్శనం

SRD: మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీకేతకి ఆలయంలో గురువారం సంగమేశ్వర స్వామికి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, ఉత్తర నక్షత్రం బృహస్పతి వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు, దీప, ధూపం, నైవేద్యం, మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకుంటున్నారు.