ప్రమాదాలకు నెలవుగా ఇంగిలాపల్లి చెరువు రోడ్డు

ప్రమాదాలకు నెలవుగా ఇంగిలాపల్లి చెరువు రోడ్డు

VZM: దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి చెరువు వద్ద పెదమానాపురం నుంచి జక్కువ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారయింది. ఇంగిలాపల్లి చెరువు వద్ద రోడ్డు గోతులమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండడంతో గతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిందని వెల్లడించారు. మరో ప్రమాదం జరగకముందే రోడ్డు మరమత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.