పాల ఉత్పత్తులపై FSSAI కీలక ప్రకటన

పాల ఉత్పత్తులపై FSSAI కీలక ప్రకటన

పాలు, పాల ఉత్పత్తులపై FSSAI కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కో-ఆపరేటివ్ డెయిరీలు మినహా పాల ఉత్పత్తిదారులు, పాల విక్రేతలు తప్పనిసరిగా FSSAIలైసెన్స్ తీసుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పింది. ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల ఏపీలో కల్తీపాల ఘటనలో 13 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే.