VIDEO: తప్పించుకునే ప్రయత్నం.. పోలీసులకి చిక్కిన ఫోన్
హైదరాబాద్‌లోని NTR మార్గ్‌లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు బైక్‌ని ఆపకుండా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వెనుక ఉన్న యువతి చేతిలోని మొబైల్‌ని లాక్కున్నారు. దీని పట్ల నెటిజన్లు భిన్న అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి..?