ఆమదాలవలసలో గంజాయి స్వాధీనం

ఆమదాలవలసలో గంజాయి స్వాధీనం

SKLM: ఆమదాలవలసలోని పరిసర ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అరెస్టైన యువకుల నుంచి 21.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ఒడిశాలోని బరంపురానికి చెందిన వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.