ప్రభుత్వ ఐటీఐలో 29న అప్రెంటిస్ మేళా
సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐలో కోకాకోలా ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈనెల 29న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పొందిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 94930 14844 నంబర్ కు సంప్రదించాలని సూచించారు. బయోడేటా, విద్యార్థుల సర్టిఫికెట్లు, ఐడి ప్రూఫ్ తీసుకురావాలని చెప్పారు.