బాబా సమాధిని దర్శించుకున్న పరిటాల సునీత

బాబా సమాధిని దర్శించుకున్న పరిటాల సునీత

సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబసభ్యులతో కలిసి గురువారం ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె బాబా మహాసమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి నామస్మరణలో మునిగిపోయిన ఆమె, బాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.