చింతలూరులో ఆకట్టుకుంటున్న విద్యుత్ అలంకరణ
కోనసీమ: ఆలమూరు మండలంలోని చింతలూరు నూకాలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. వినూత్న డిజైన్‌లతో రంగురంగుల విద్యుత్ దీపాలు వెలుగుల కాంతులతో ఆలయ పరిసరాలు మెరిసిపోతున్నాయి. జాతరలకు తరలివస్తున్న భక్తులు ఈ దృశ్యాలను తిలకిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.