“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో పాల్గొన్న MLA రేవూరి
HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు' కార్యాచరణలో భాగంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రోడ్డు రవాణా నియమాలు పాటించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన ఎంతో ముఖ్యమని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.