ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

GNTR: ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం నిడమర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులు నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు వివరాలను విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణ పైన మరింత శ్రద్ధ వహించాలన్నారు.