VIDEO: కిళ్లాం పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలు

SKLM: నరసన్నపేట మండలం కిళ్లాం పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నామని సర్పంచ్ బోడి రామన్న తెలిపారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నేరుగా సర్పంచ్ దోమల మందులు పిచికారి చేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు దోమలు ఎక్కువగా ఉండడంతో వాటి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.