VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్దం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్దం

ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ పూర్తిగా కాలిపోయింది. మార్కాపురానికి చెందిన ఎన్.వెంకటరామిరెడ్డి గిద్దలూరులో పనుల నిమిత్తం జేసీబీని తీసుకెళ్లారు. గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎర్రబాలెం-నల్ల కాల్వ మధ్య వాహనంలో వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయినట్లు యజమాని తెలిపారు.