అంబటి రాంబాబు మోసం చేశారని సంచలన ఆరోపణ

అంబటి రాంబాబు మోసం చేశారని సంచలన ఆరోపణ

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లి వైసీపీ నేత బద్దుల నాగేశ్వరరావుపై ఓ తాపీమేస్త్రి సంచలన ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు తనను మోసం చేశారని.. సత్తెనపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం కట్టమని ఐదేళ్ల క్రితం తనను సంప్రదించారని తెలిపారు. ఏడు లక్షల రూపాయల పని చేస్తే ఎన్నోసార్లు తిరిగిన తర్వాత నాలుగు లక్షలు మాత్రమే తిరిగిచ్చారని ఆరోపించారు. వైసీపీ పెద్దలు కలగజేసుకుని  ఇప్పటికైనా తన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.