జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రావీణ్య ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. రూ.80 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణం పనులను పరిశీలించి పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.