జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదివారం మండల అధ్యక్షుడు కొత్త కాపు జగన్ రెడ్డి నేతృత్వంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయబోతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.