PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
SRD: కల్హేర్ మండలం బీబిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు సంఘ ఉపాధ్యక్షులు గుర్రపు కృష్ణమూర్తి వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. అందుబాటులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు, గ్రామపెద్దలు, రైతులు, పాల్గొన్నారు.