ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

బాపట్ల జిల్లాలోని చీరాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్వయంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 177 అర్జీలు రాగా, వీటిలో ఇంటి నిర్మాణాల కోసం, ఇంటి స్థలాల కోసం 140, 27 పింఛన్లు, 10 పలు సమస్యలపై అర్జీలు అందాయి.