BRS నేతల హౌస్ అరెస్ట్‌పై KTR ఫైర్
TG: BRS నేతల గృహనిర్బంధాలపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వెళ్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. పోలీసుల బలంతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని విమర్శించారు. ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ నేతలకు అరెస్టులు కొత్తేమీ కాదని, రైతుల కోసం పోరాడుతామని వెల్లడించారు.