ఆసిఫాబాద్‌లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్
ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ వార్డు నం.16లో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. మహిళలకు తడి, పొడి, హానికర చెత్త నిర్వహణ, హోమ్ కంపోస్టింగ్‌పై అవగాహన కల్పించారు. దోమల నివారణకు మందు స్ప్రే చేసి, బ్లీచింగ్ చల్లారు. అన్ని ఇంటి, నీటి పన్ను వసూళ్ల డ్రైవ్ కొనసాగుతోంది. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలన్నారు.