'రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించండి'
ATP: జిల్లాలో రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ సోమవారం గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్‌కు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. డివిజన్ కమిటీ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.