స్వామిత్వ యాప్ ద్వారా గ్రామీణులకు ఆస్తి కార్డులు: డీపీవో
GNTR: దశాబ్దాల తరబడి ఆస్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణులకు 'స్వామిత్వ' కార్యక్రమం ద్వారా భారీ మేలు జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్ తెలిపారు .గుంటూరు మండలం మల్లవరం గ్రామంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పరిధిలోని గృహాల మ్యాపింగ్ జరిగింది. మ్యాపింగ్ పూర్తయ్యాక ప్రభుత్వం వారికి స్థిరాస్తి కార్డులు అందిస్తుందన్నారు.