పెద్ద మనసు చాటుకున్న పెళ్లి కూతురు

పెద్ద మనసు చాటుకున్న పెళ్లి కూతురు

ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పెళ్లి కూతురు పెద్ద మనసు చాటుకుంది. టర్కిష్ ప్రావిన్స్ బాట్‌మాన్‌కు చెందిన ఓ వధువు తన వివాహ రిసెప్షన్‌లో వచ్చిన కట్నాన్ని పాలస్తీనా ప్రజలకు సహాయం చేయడానికి విరాళంగా ఇచ్చింది. రూ.33 లక్షలకుపైగా డొనేట్ చేసింది. ఇందుకు కుటుంబ సభ్యులు సైతం ఆమెను ప్రోత్సహించినట్లు సమాచారం.