సింహాద్రిపురంలో రేపు గురుకుంట తిరుణాల
KDP: కార్తీక మాస చివరి సోమవారం రోజు సింహాద్రిపురం మండలం గురిజాల గ్రామ సమీపంలోని గురుకుంట ఆలయ సముదాయంలో రేపు తిరుణాల నిర్వహించనున్నట్లు నిర్వాహకుల ఇవాళ పేర్కొన్నారు. ఈ తిరుణాల కోసం ఆలయ సముదాయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంజనేయస్వామి, శివాలయాలను అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని డీఎం తెలిపారు.