కార్తీక మాసంలోనూ తగ్గని చికేన్ ధరలు...
వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు ఆదివారం పలు ప్రాంతాల్లో ఈ విధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 184 నుంచి రూ.210 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 210 నుంచి రూ.240 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు కనిపించడం లేదు. కార్తీక మాసంలో సైతం ధరల్లో మార్పులు లేకపోడంతో మాంస ప్రియులు నిరాశ చెందుతున్నారు.