అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

NZB: ఆర్మూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఇవాళ రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఇస్సపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మభ్యపెట్టడానికి మద్యాన్ని ఒక ఆటోలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.65 వేల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. పట్టుకున్న మద్యాన్ని అధికారులు తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.