'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'
సంగారెడ్డిలో రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో గురువారం సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.