జీడిపప్పు పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే
BPT: వేటపాలెంలో అనంత భారత్ జీడిపప్పు పరిశ్రమను సోమవారం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరిశీలించారు. జీడిపప్పు వ్యాపార స్థితిగతులను ఆయన ప్రోప్రైటర్ ప్రతి వెంకట సుబ్బారావును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కుటీర పరిశ్రమగా చేతితో తయారు చేసిన జీడిపప్పు ప్రాధాన్యతను వెంకట సుబ్బారావు ఎమ్మెల్యేకు వివరించారు. పరిశ్రమకు తమ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు.