జెండర్ క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరణ
VSP: లింగ ఆధారిత వివక్షపై పోరాటం, నివారణ చర్యల బలోపేతంపై పౌరుల్లో బాధ్యత పెరగాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉద్ఘాటించారు. స్త్రీ, పురుషుల సమానత్వం సమాజాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తుందని అభిప్రాయపడ్డారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు 'నయీ చేతన 4.0- మార్పు కోసం ముందడుగు' ప్రచార పోస్టర్ ఆయన సోమవారం ఆవిష్కరించారు.