తిమ్మాపురంలో భానుడికి 'మహా సౌర హోమం'

తిమ్మాపురంలో భానుడికి 'మహా సౌర హోమం'

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. మధ్యాహ్నం క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్ధన్ ఆధ్వర్యంలో ‘మహా సౌర హోమం’ వైభవంగా జరిగింది. భక్తులకు ఆలయ కమిటీ వారు అన్ని సౌకర్యాలు కల్పించారు.