లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
KNR: సైదాపూర్ మండలంలోని 29 గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు రూ. 73,08,468 విలువగల చెక్కులను సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొంత సుధాకర్, తహశీల్దార్ గుర్రం శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ఆడబిడ్డల కళ్లలో ఆనందం నింపేందుకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.