ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

MBNR: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి హాజరై యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.