నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారి విస్తరణ పనుల కారణంగా సోమవారం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ హుస్సేన్ ఖాన్ తెలిపారు. నగరంలోని ఎస్వీఎన్ కాలనీ, గుజ్జగుండ్లలోని కొన్ని ప్రాంతాలలో అంతరాయం ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.