ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ATP: అనంతపురం రామ్ నగర్‌లోని తన కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం 'ప్రజా దర్బార్' నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వచ్చిన ప్రజలు, నాయకుల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి పేర్కొన్నారు.