మున్సిపల్ నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ
ASF: ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సోమవారం అధికారికంగా తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. MLA కోవ లక్ష్మి సమక్షంలో, మున్సిపల్ కమిషనర్ గజానంద్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. నూతన బాధ్యతలు చేపట్టిన వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.