సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

KRNL: జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ. సిరి ఇవాళ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంతో పాటు అన్ని మండల రెవెన్యూ, ఆర్డీవో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ లేదా Meekosam వెబ్‌సైట్ వినియోగించుకోవాలని సూచించారు.