వేములవాడ ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా అంజనారెడ్డి
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో అంజనా రెడ్డి గారిని ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.