పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NLR: ఉలవపాడు మండలం టెంకాయచెట్ల పాలెం గ్రామంలో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై నిన్న ఎస్సై అంకమ్మరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం రూ. 68,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.