హనుమాన్ మాలలో ఉన్నారని స్కూల్లోకి నో ఎంట్రీ
JGL: మెట్‌పల్లి నిఖిల్ భారత్ స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన ఐదుగురు విద్యార్థులను పాఠశాల నిబంధనల పేరుతో యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీంతో హనుమాన్ స్వాములు ధర్నాకు దిగారు. 21 రోజుల పాటు స్కూల్‌కు రావద్దని విద్యార్థులకు చెప్పడంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. భక్తులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.