నేటి నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం
KRNL: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభమవుతుందని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ తెలిపారు. ఎ.క్యాంప్ మాంటిస్సోరి పాఠశాలలో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మూల్యాంకనంలో 730మంది ఎగ్జామినర్లు, 230మంది స్పెషల్ అసిస్టెంట్లు, 8మంది అధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.