పెన్షన్లు తొలగిస్తే ఉద్యమాలకు దిగుతాం: MLA హెచ్చరిక

KRNL: దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ పునఃపరిశీలనలో అనర్హత పేరుతో పెన్షన్ లబ్ధిదారులను ఇబ్బంది పెడితే, వారి తరఫున ఉద్యమాలు చేపడతామని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హెచ్చరించారు. 100% వైకల్యం ఉన్నవారిని 40% కంటే తక్కువగా నిర్ధారించి పెన్షన్ తొలగించడం అన్యాయమని అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా గత ధృవీకరణ పత్రాల ఆధారంగా పెన్షన్ కొనసాగించాలని పేర్కొన్నారు.