పాసర్లపూడి లంకలో నిజాయితీ చాటుకున్న స్వీపర్
కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి లంకలో పంచాయతీ స్వీపర్ తన నిజాయితీని చాటుకున్నాడు. గ్రామపంచాయతీ సెక్రటరీ డి.సురేష్ కి చెందిన రూ.లక్ష విలువైన బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా దొరకలేదు. అయితే స్వీపర్ రాయుడు ప్రసాద్ ఆదివారం ఉదయం శుభ్రం చేస్తుండగా ఆ గొలుసు లభ్యమైంది. వెంటనే గొలుసును సెక్రటరీకి అందజేశారు. అతని నిజాయితీని పలువురు అభినందించారు.