కానిస్టేబుల్‌పై ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు దాడి
SRPT: మోతే మండల పరిధిలోని రాయకుంట తండా గ్రామ శివారులో నిన్న రాత్రి అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న మోతే కానిస్టేబుల్ కృష్ణంరాజుపై దుండగులు దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఆయనపై ఇద్దరు డ్రైవర్లు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.