పాయకరావుపేట ఇరిగేషన్ డీఈగా సురేష్ కుమార్

పాయకరావుపేట ఇరిగేషన్ డీఈగా సురేష్ కుమార్

AKP: పాయకరావుపేట నీటిపారుదల శాఖ డీఈగా సురేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పదోన్నతిపై సురేశ్ కుమార్ పాయకరావుపేట బదిలీపై వచ్చారు. కాలువల మరమ్మతు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. ఏఈ శ్రీరామమూర్తి, కార్యాలయం సిబ్బంది డీఈ సురేష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.