ప్రేమ పేరుతో రూ. 22 లక్షల మోసం.. ట్రాన్స్ జెండర్ ఆవేదన
కర్నూలు: ఓర్వకల్లు మండలం హుసేనాపురం నివాసి ట్రాన్స్ జెండర్ గీత, చిన్నటేకూరు గ్రామానికి చెందిన వడ్డే పరశురాం తనను ప్రేమ పేరుతో 2024 నుండి రూ. 22 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆరోపించింది. ఆదివారం గీత తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.