HYDలో పాకిస్థాన్ దేశస్థులు ఎక్కడున్నారో గుర్తించాం: సీపీ

HYD: పాకిస్థాన్ దేశస్థులు ఎక్కడున్నారో గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నోడల్ కేంద్రంగా ఉంటుందన్నారు. నగరంలో ఆరు లక్షల కెమెరాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.