‘ఇంపాక్ట్‌ ప్లేయర్’గా బుమ్రా

‘ఇంపాక్ట్‌ ప్లేయర్’గా బుమ్రా

వెస్టిండీస్‌పై గెలిచి టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చే 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సంజూ శాంసన్‌ను కాదని బుమ్రా దక్కించుకోవడం విశేషం. ఒకే ఓవర్‌లో ప్రమాదకర బ్యాటర్లు హెట్మెయెర్, ఛేజ్‌లను ఔట్ చేసి బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అందుకే అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేశామని మేనేజ్మెంట్ పేర్కొంది.