మాజీ సర్పంచ్ పాడె మోసిన ఎమ్మెల్యే

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు బుధవారం దుద్దుకూరు వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి ఆయన సూర్యారావు పాడె మోశారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.