దేశ వ్యతిరేక శక్తులకు పరాభవం తప్పదు: కిషన్ రెడ్డి
HYD: ఉగాది వేడుకల్లో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరంలో దేశ వ్యతిరేక శక్తులకు పరాభవం తప్పదని పేర్కొన్నారు. ప్రపంచంలో అనిశ్చితి ఉన్నా.. భారత్ అభివృద్ధి, స్థిరత్వ దిశగా ముందుకు సాగుతోందని, ఐక్యతే మన బలమని చెప్పారు. పంచాంగ శ్రవణం అనంతరం రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.