వత్తుగుండ్ల గ్రామానికి బస్సు నడపాలి: PDSU

వత్తుగుండ్ల గ్రామానికి బస్సు నడపాలి: PDSU

NRPT: దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి వెంటనే ఆర్టీసీ బస్సులు నడపాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. సరైన బస్సులు నడపలేక పోవడం వలన విద్యార్థులు చదువులకు దూరమై నిరక్షరాస్యులుగా మారిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నేటి నుంచి అయినా వత్తుగుండ్ల గ్రామానికి బస్సు నడపాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని PDSU నాయకులు పేర్కొన్నారు.