నిలిచిన నీరు.. పాదచారుల ఇక్కట్లు

VZM: కొత్తవలస కూడలికి అనుకొని ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ వద్ద వర్షం పడకపోయినా నీరు తరచూ నిలిచిపోతుంది. దీంతో నడకదారిన వెళ్లేవారు అపసవ్య దిశలో రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దీనివలన ఎదురుగా వచ్చే వాహనాల ఢీ కొట్టే ప్రమాదం ఉంటుందని పాదచారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని పాదచారులు కోరుతున్నారు.